- జిల్లా జాయింట్ కలెక్టర్ జేసీ శ్రీమతి యాస్మిన్ భాషా
రాజన్న సిరిసిల్ల,28 అక్టోబర్ (వుదయం ప్రతినిధి) : వారం రోజుల్లోగా ప్రజావాణి పెండింగ్ ఫిర్యాదులు పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ జేనీ శ్రీమతియాస్మిన్ భాషా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు . కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జేసీ శ్రీమతి. యాస్మిన్ భాష ప్రజల నుంచి వినతులు , ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులనుద్దేశించి జేసి మాట్లాడారు .ప్రజావాణిలో ప్రజలు తమకు సత్వర న్యాయం చేకూరుతుందనే భరోసాతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తమ సమస్యలను విన్నవించుకుంటున్నట్లు పేర్కొన్నారు. అన్ని స్థాయిల అధికారులు ప్రజలకు వారి సమస్యల స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులు పాతవి మళ్లీ పునరావృత్తం కాకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులతో పెండింగ్ ఫిర్యాదుల పై సమీక్షించి వెంటనే పరిష్కారం చూపాలని జేసి సూచించారు . ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి భూ సమస్యల పరిష్కారం , ఉపాధి కల్పన, రుణాలు, ఇళ్లు, పెన్షన్లు మొదలైన అంశాలపై వచ్చిన వినతులు , ఫిర్యాదులను జిల్లా జాయింట్ కలెక్టర్ జేసీ శ్రీమతి. యాస్మిన్ భాషా, %ణ=% ఎన్ స్వీకరించి పరిశీలన, పరిష్కారానికి నంబంధిత అధికారులకు అందజేశారు. కాగా సోమవారం ప్రజావాణికి మొత్తం 64 ఫిర్యాదులు అందాయి .వీటిలో రెండు పడక గదుల ఇళ్ళ మంజూరు కోరుతూ 12 దరఖాస్తులు రాగా , పెన్షన్ ల మంజూరు కోరుతూ 24 మంజూరు కోరుతూ రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు అందాయి. గజ% కి ఒక గ% 225 ఫోన్ కాల్ ఫిర్యాదు వచ్చింది . రాత పూర్వక శ్రీ అనుమతితోనే సెలవులో వెళ్ళాలి శ్రీమతి. యాసిస్ శ్రీమతి. యాస్మిన్ భాషా జిల్లా అధికారులు చాలామంది వాట్సాప్ లో మెసేజ్ పెట్టి సెలవులో వెళ్లడంపై జేసీ ఆగ్రహం వ్యక్త%8% చేసారు. దీనివల్ల పౌరులకు సేవలు అందించడంలో తీవ్ర జాప్యం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇకముందు జిల్లా కలెక్టర్ ముందస్తు రాత పూర్వక అనుమతితోనే సెలవులపై వెళ్లాలన్నారు. మెడికల్ ఎమర్జెన్సి, ఇతర అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే వాట్సాప్ మేసేజ్ ద్వారా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ లో శాఖా పరమైన సమావేశాలకు హాజరుకావాల్సిన సమయంలో సైతం జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి అవసరమన్నారు . ఆదేశాలను భేఖాతరు చేస్తే భాద్యులైన జిల్లా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌట్ విద్యార్థికి పాఠశాలలో ప్రవేశ% బోయిని పెల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందినా హరిప్రసాద్ గత సంవత్సరం బోయిన పెల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశం పొందాడు. తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్ళగా తల్లి కూలీ పని చేస్తూ హరిప్రసాద్ ను చదివిస్తుందిఅనారోగ్య కారణాలతో 5వ తరగతి వార్షిక పరీక్షలు రాయలేకపోయాడుదీంతో బాలుడి తల్లి ప్రజావాణికి వచ్చి తన దీన పరిస్థితిని వివరించి కన్నీటి పర్యంత%8% అయ్యింది. తన కొడుకు హరిప్రసాద్ కు తిరిగి గురుకులంలో 5 లేదా 6వ తరగతిలో ప్రవేశం కల్పించాలని వేడుకుందిగురుకులంలో లేదా 6వ తరగతిలో ప్రవేశం కల్పించ స్పందించిన జని బొయినపల్లి ప్రిన్సిపాల్ తో మాట స్పందించిన జేనీ బోయిన పెల్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి హరిప్రసాద్ కు ప్రవేశం కల్పించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం ప్రవేశం కల్పించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి భీమ్యా నాయక్, ఆర్.డి.ఓ టి. శ్రీనివాసరావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.